Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరులో చిరంజీవి మేనియా... భారీగా మెగాస్టార్ కటౌట్లు

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ‘ఖైదీ నంబరు 150’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిరు 150వ సినిమాకి ఇత‌ర రాష్ట్రాల్లోనూ మంచి స్పంద‌న వ‌స్తోంది. బెంగ‌ళూరులో చిరంజీవి మేనియా క‌న‌ప‌డుతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో అభిమానులు పెద్ద పెద్ద కటౌట్‌లను ఏర్పాటు చేసి సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. క‌టౌట్ల‌కి నిలువెత్తు పూలదండలు వేసి హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్‌లలోనూ ఆయ‌న అభిమానులు మెగాస్టార్ నినాదాలు చేస్తున్నారు. చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వ‌ర్యంలో పలు చోట్ల అన్నదానాలు కూడా చేశారు.
chiru
khaidi

More Telugu News